గోప్యతా విధానం

వ్యక్తిగత సమాచారం

కొత్త సేవలు, రిలీజులు, రాబోయే సంఘటనలు, ఈ ప్రైవసీ పాలసీ స్టేట్మెంట్ లో మార్పులను మీకు తెలియ జేయడానికి ఎం బిల్ రిజిస్ట్రేషన్ సమయంలో తెలిపిన మీ పేరు మరియు ఫోన్ /ఈమెయిలు అడ్రస్ ను ఉపయోగిస్తాము. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఏ విధమైన ప్రమోషనల్ ప్రయోజనాలకోసం ఉపయోగించము. మీ అనుమతి తీసుకొన్న తరవాతే మీ వివరాలను ఉపయోగిస్తాము.

డెమో లాగిన్

ఎం బిల్ యూజర్లకు శిక్షణ ఇవ్వడానికి ఒక డెమో లాగిన్ ను సృష్టించాము. డెమో లాగిన్ లో చేర్చిన ఏ సమాచారమైన ఆ డెమో లాగిన్ ను ఉపయోగించే వారందరికీ అందుబాటులో ఉంటుంది. అందువల్ల, డెమో లాగిన్ ను ఉపయోగించే సమయంలో దయచేసి మీ వ్యక్తిగత , సెన్సిటివ్ సమాచారం, ఫైళ్లు లేదా డాక్యుమెంట్ లను స్టోర్ చేయకండి. ఎం బిల్ డెమో లాగిన్ లో పోస్ట్ చేసిన సమాచారం యొక్క గోప్యతకు బాధ్యత వహించదు.

ఉపయోగిత వివరాలు

మీ యూసేజ్ పద్దతిని అర్థం చేసుకోవడం కోసం, సమయం, ఫ్రీక్వేన్సీ, డ్యురేషన్, ఉపయోగించిన ఫీచర్లు మొదలైన వివరాలను పొందడం కోసం ఎం బిల్ తన వెబ్సైటు/ఆప్ లలో స్మార్ట్ అనలిటిక్స్ ఉపయోగిస్తుంది. వెబ్సైటు/ఆప్ లలో మీ యూజర్ అనుభవాలను నిరంతరం తాజాగా ఉంచడానికి ఈ పద్దతి అవలంబిస్తుంది.

మీ అకౌంట్ వివరాలు

సిస్టం ఎర్రర్ ల ఫలితంగా డేటా నష్టాన్ని నిరోధించడానికి మీ డేటా అంతా థర్డ్ పార్టీ లొకేషన్ లో బాక్ అప్ గల క్లౌడ్ స్టోరేజ్ సిస్టం లో భద్రపరుస్తారు. మీ యూజర్ అకౌంట్ ఆగిపోయినప్పటికీ మీ ఫైళ్లు, డేటా మా సర్వర్ లలో ఉంటుంది. ఐతే, మీ డేటా సురక్షితంగా ఉంటుంది. దానిని మేము ఎవరితో పంచుకోము. ఎంబిల్ బృందానికి కూడా అందుబాటులో ఉండదు. [ ఈ డాక్యుమెంట్ లో పేర్కొన్న సందర్భాలలో తప్ప]

విజిటర్ వివరాలు

మా వెబ్సైటు విజిటర్ల వివరాలలో కొన్ని మేము ఉపయోగించుకొంటాము. ఇది కేవలం ధోరణులను విశ్లేషించడానికి , విజిటర్ ల కదలికలను ట్రాక్ చేయడానికి, మా వెబ్సైటు యొక్క మెరుగుదల పరిధిని నిర్వచించడానికి మాత్రమె. ఈ వివరాలలో ఐ పి అడ్రస్, బ్రౌజర్ భాష, బ్రౌజర్ రకం, పరికించిన ఫైళ్లు, ఆపరేటింగ్ సిస్టం మొదలైన అంశాలు చేరతాయి.

కుకీస్ & విడ్జెట్ లు

మా వెబ్సైటు యొక్క పనితీరు, ఆఫరింగ్ల ను మెరుగుపరచడానికి యూజర్ బేస్ మరియు వెబ్సైటు కంటెంట్ కు సంబంధించిన డేటా ను విశ్లేషించడానికి మేము థర్డ్ పార్టీ ని నియమిస్తాము. ఈ పని కోసం థర్డ్ పార్టీ
కుకీలను ఉపయోగించవచ్చు. ఈ థర్డ్ పార్టీ కుకీలు మీ వ్యక్తిగత సమాచారానికి సంబంధించినవి కావు. ఎంబిల్ కు ఈ కుకీలు అందుబాటులో ఉండవు. కనుక వీటికి బాధ్యత వహించదు. థర్డ్ పార్టీ విడ్జెట్స్ ను వెబ్సైటు లో ఎంబిల్ సమర్థిస్తుంది. ఈ విడ్జెట్స్ యూజర్లనుండి ఏరకమైన సమాచారాన్ని సేకరించవు, స్టోర్ చేయవు.

మా వెబ్సైటు లపై లింకులు

మీరు ఇతర వెబ్సైటు లను నావిగేట్ చేయడం కోసం మా వెబ్సైటు లో కొన్ని బాహిర లింక్ లు ఉంటాయి. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వడానికి ముందు ఆయా వెబ్సైటు ల ప్రైవసీ పాలసీ ని చదవండి.

సమాచారాన్ని షేర్ చేసుకోవడం

సమర్థ వంతమైన సేవలను అందివ్వడానికి మీ వ్యక్తిగత వివరాలను మేము మా బిజినెస్ భాగస్వాములకు తెలియజేయ వలసి ఉంటుంది. మా బిజినెస్ భాగాస్వాములందరూ ఈ ప్రైవసీ పాలసీ కి బద్ధులై ఉంటారని, మీ సమాచారాన్ని గోప్యంగా ఉంచడానికి అన్ని చర్యలు తీసుకున్నామని, దానిని దుర్వినియోగం చేయమని ఎంబిల్ బాధ్యత వహిస్తుంది. అంతేకాక, మీరు అనుమతిస్తేనే మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎంబిల్ కు బయటివారితో షేర్ చేస్తాము. చట్టపరమైన అంశాలకోసం, స్థానిక లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు మీ సమాచారాన్ని ఇవ్వాలని చట్టం నిర్బందిస్తే , అటువంటి సందర్భాలలో మీ సమాచారాన్ని షేర్ చేస్తాము.

సమాచారాన్ని పొందడం

కొత్త సేవలు, రిలీజులు, రాబోయే సంఘటనలు, న్యూస్ లెటర్, సందేశాలు వంటి వాటికి సంబంధించిన ఈమెయిలు నోటిఫికేషన్ లు, ఇతర అప్డేట్ ల మెయిల్ లను అక్కరలేదని యూజర్లు ఎంచుకోవచ్చు.

సమాచారాన్ని తాజాగా ఉంచడం

యూజర్లు తమ అకౌంట్ ను తెరవడం ద్వారా లేదా ఎం బిల్ కస్టమర్ సపోర్ట్ సేవలను సంపాదించడం ద్వారా తమ వివరాలను ఆక్సెస్ చేయవచ్చు, ఆ సమాచారాన్ని ఎడిట్ చేయవచ్చు.

సామాజిక ప్లాట్ఫారం లు

ఎంబిల్ వెబ్సైటు లో సమాచారాన్ని షేర్ చేయడానికి యూజర్లు సమాచారాన్ని బ్లాగ్ లలో మరియు ఫోరంలలో పోస్ట్ చేయవచ్చు. ఈ సమాచారం ఈ ఫారంలను ఉపయోగించే వారందరికీ లభ్యమవుతుంది. అందువల్ల ఈ ప్లాట్ఫారం లలో తమ వివరాలు తెలిపే విషయంలో యూజర్లు జాగ్రత్త వహించాలి. విజిటర్లు/యూజర్లీ తెలిపే గోప్యమైన లేదా వ్యక్తిగత సమాచారానికి ఎంబిల్ బాధ్యత వహించదు. మా వెబ్సైటు లో గాని లేదా ఇతరత్రా గాని యూజర్లు తమ
టెస్టిమోనియల్ లను పోస్ట్ చేసేటప్పుడు ఏదైనా వ్యక్తిగత సమాచారం ఇచ్చినట్లయితే దానికి ఎం బిల్ బాధ్యత వహించదు.

ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ నుండి ఎంబిల్[mBill] ఆప్ ను డౌన్ లోడ్ చేసుకోండి.

google play store